లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించాలి
భద్రాచలంఅర్బన్: డిసెంబర్ 14న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు రాజీ పడేలా చూడాలని భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని భద్రాచలం కోర్టులో భద్రాచలం, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల పోలీసులు, భద్రాచలం ఎకై ్సజ్, రెవెన్యూ శాఖల అధికారులు, న్యాయవాదులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, మోటారు వాహనాల కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్, భద్రాచలం పట్టణ సీఐ సంజీవరావు, దుమ్ముగూడెం సీఐ ఆశోక్, బూర్గంపాడు ఎస్‌ఐ రాజేష్, భద్రాచలం ట్రాఫిక్ ఎస్‌ఐ మధుప్రసాద్, భద్రాచలం ఎకై ్సజ్ సీఐ రహీమున్నీసా బేగం, ఎఫ్‌ఆర్‌ఓ రంజిత తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి
శివనాయక్
Comments
Please login to add a commentAdd a comment