కొత్తగూడెంఅర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు జిల్లాలో 784 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. కొత్తగూడెంలో కోర్టు దగ్గర ఉన్న చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సింగరేణి పాఠశాల, సెయింట్ మెరీస్ హై స్కూల్, బాబుక్యాంపులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు పరీక్షల సహాయ కమిషనర్ ఎస్.మాధవరావును 99890 27943 నంబర్లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment