రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టు శిక్షణ శిబిరం షురూ
కొత్తగూడెంఅర్బన్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫుట్‌బాల్ జట్టుకు శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. ఈ శిబిరానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఎంపిక చేసిన 16 మంది క్రీడాకారులు హాజరయ్యారు. తొలి రోజు క్రీడాకారులకు శారీరక వ్యాయామం, ఫుట్‌బాల్ క్రీడలోని మెళకువలను జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు గౌతంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బట్టు ప్రేమ్‌కుమార్ వివరించారు. శిబిరంలో పాల్గొనే క్రీడాకారులకు స్థానిక హోటల్లో బస ఏర్పాటు చేశారు. వారికి స్పోర్ట్స్ డైట్‌ను నిర్వాహకులు అందజేశారు. ఈ శిబిరం నవంబర్ 25 వరకు కొనసాగుతుంది. జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు జమ్మూ కశ్మీ ర్‌లో జరగనున్నాయని ఫెడరేషన్ కార్యదర్శి వాసిరెడ్డి నరేశ్‌కుమార్ తెలిపారు.
మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం..
కొత్తగూడెంటౌన్: స్థానికులు క్రీడల్లో రాణించేలా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి పి.పరంధామరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో రెజ్లింగ్ క్రీడాకారిణి ఆర్.గీతాహర్షిణి, అసోసియేషన్ సభ్యులు.. డీవైఎస్‌ఓను మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ మాట్లాడుతూ.. ఇటీవల మహబూబాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థా యి స్కూల్ గేమ్స్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అండర్–17 విభాగంలో పాల్గొని ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించిందన్నారు. డిసెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు గీతాహర్షిణి ఎంపికవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పి.కాశీహుస్సేన్, నరేశ్, రవి, తిరుమల్‌రావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
రామయ్య సేవలో డిప్యూటీ డైరెక్టర్
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ రాజవర్థనా చారి సందర్శించారు. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి జ్ఞాపికతోపాటు ప్రసాదం అందజేశారు. జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి సంపత్‌కుమార్, జిల్లా కార్యదర్శి పరిమి సోమశేఖర్ పాల్గొన్నారు.
భద్రాచలం వాసి
మంజులకు డాక్టరేట్
భద్రాచలంటౌన్: భద్రాచలంకు చెందిన బుడగం మంజులాదేవి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. సీనియర్ ఆచార్యులు కె.పురుషోత్తం ఆధ్వర్యాన ఆమె సాహిత అకాడమీ అవార్డు గెలుచుకున్న నవలలపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంధానికి డాక్టరేట్ ప్రకటించారు. కాగా, మంజుల, ఆమె భర్త కాంగ్రెస్ నాయకుడైన బుడగం శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.
చేప పిల్లల పంపిణీ
దుమ్ముగూడెం: జిల్లా మత్స్య సహకార శాఖ ఆధ్వర్యంలో మండలంలోని గంగోలు చెరువులో 31,800, నల్లబల్లి చెరువులో 37,500 చేప పిల్లలను శుక్రవారం జిల్లా మత్స్యశాఖాధికారి ఎండీ ఇంతియాజ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ అధికారి కోటేశ్వరరావు, సిబ్బంది మంగయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో వేధింపులు
ఇల్లెందు: మద్యానికి బానిసైన తన భర్త మానసికంగా వేధిస్తున్నాడని పట్టణంలోని కొత్తబస్టాండ్ ఏరియాకు చెందిన జివ్వాజి నమిత శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసంది. బాధితురాలికి 14 ఏళ్ల కిందట చిన్నరాముతో వివాహమైంది. ఇటీవలి కాలంలో రాము రోజూ మద్యం సేవించి ఇంటికి రావడంతోపాటు వేధిస్తున్నాడని నమిత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ రవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment