మత్తుపదార్థాల రవాణాను అరికట్టాలి
ఎస్పీ రోహిత్ రాజు
అశ్వారావుపేటరూరల్: ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణాను అరికట్టాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. తొలుత పోలీస్ స్టేషన్, పక్కనే ఉన్న సీఐ, ఎస్సై క్వార్టర్లు, జంగారెడ్డిగూడెం మార్గంలోని సిబ్బంది క్వార్టర్లు, పోలీస్ శాఖకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందితో మాట్లాడారు. న్యాయ సలహా తీసుకుని సర్కిల్ పరిధిలో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కోడి పందేలు, పేకాట, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐలు నాగరాజు, కరుణాకర్, ఎస్సైలు యయాతి రాజు, శివరామకృష్ణ, దమ్మపేట ఎస్సై సాయికిశోర్ రెడ్డి, ఏఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment