కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దాం..
ఇల్లెందురూరల్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్మించి సంఘటిత శక్తితో ప్రతిఘటిద్దామని ఇఫ్టూ జాతీయ అధ్యక్షుడు ఆరెళ్లి కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ పిలుపునిచ్చారు. మండలంలోని ముకుందాపురం క్యాంపు సెంటర్‌లో ఇఫ్టూ అనుబంధ టీటీడబ్ల్యూ రాష్ట్ర రెండో మహాసభను శుక్రవారం నిర్వహించగా వారు మాట్లాడారు. బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలంతో దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల చట్టాలను తయారు చేస్తూ అదానీ, అంబానీలను అపర కుబేరులుగా తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు. మత, కుల వివక్షతో సనాతన ధర్మం పేరుతో దాడులు జరుగుతున్నా కేంద్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఐక్యంగా కార్మికులు సాధించుకున్న హక్కులను పాలకులు సవరణల పేరుతో అన్యాయం చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తొలుత పెంకు పరిశ్రమల కార్మికులు ముకుందాపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌కే మదార్, బానోత్ రాంసింగ్, లింగ్యా, దుర్గాప్రసాద్, మూతి రాంబాబు, సనప రాంబాబు, సాంబ, సారయ్య, రంగబాబు, సత్తిబాబు, శ్రీరాములు, స్వరూప, బుగ్గ రవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment