ఆపరేషన్‌ విఫలమైందని డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ విఫలమైందని డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు

Published Sat, Nov 23 2024 12:35 AM | Last Updated on Sat, Nov 23 2024 12:35 AM

ఆపరేషన్‌ విఫలమైందని డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు

ఆపరేషన్‌ విఫలమైందని డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు

కొత్తగూడెంరూరల్‌: కొత్తగూడెంలోని గణేశ్‌ నర్సింగ్‌ హోంలో డాక్టర్‌ ఎం.బసంతి చేసిన ఆపరేషన్‌ విఫలమై తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని మేదరబస్తీకి చెందిన బొమ్మోజు నాగమహేశ్వరి శుక్రవారం డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జూన్‌లో డెలివరీ కోసం గణేశ్‌ నర్సింగ్‌ హోంలో చేరగా.. ఆపరేషన్‌ చేసిన తర్వాత నెల రోజుల నుంచి కడుపునొప్పి వస్తోందని, అక్కడ గడ్డలు ఏర్పడ్డాయని తిరిగి డాక్టర్‌ బసంతిని సంప్రదించినట్లు పేర్కొంది. వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చిన అనంతరం ఒక కుట్టును కత్తిరించి ఏమీ లేదని ఇంటికి పంపించారని చెప్పింది. ఆ తర్వాత ఆపరేషన్‌ చేసిన చోట పుండు కావడంతోపాటు రక్తం, దారాలు కూడా బయటకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆపరేషన్‌ వల్ల జరిగిన నష్టాన్ని డాక్టర్‌ బసంతికి వివరిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు తనకు సంబంధం లేదని బుకాయిస్తోందని ఫిర్యాదులో వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement