పర్యాటక కేంద్రంగా కనకగిరి..
చండ్రుగొండ : బెండాలపాడు శివారులోని కనకగిరి గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. మండలంలోని బెండాలపాడు శివారులో ఉన్న బ్యాంబో క్లస్టర్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. క్లస్టర్ చైర్మన్‌తోపాటు డైరెక్టర్లతో మాట్లాడారు. కొత్తగా ప్రారంభించిన వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కనకగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే విద్యార్థులు విహారయాత్రలకు కూడా వస్తారని తెలిపారు. ఈ దిశగా ముందడుగు పడుతోందని, డిసెంబర్‌లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాంతంలో వెదురుతోపాటు ముఖ్యమైన ఔషధ మొక్కలు ఉన్నాయన్నారు. ఇంతటి చరిత్ర ఉన్న ప్రాంతంలో ఫారెస్టు రేంజర్ చలమల శ్రీనివాసరావు హత్యకు గురవడం విచారకరమన్నారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్‌ను బ్యాంబో ఉత్పత్తులతో ఆకర్షణీయంగా మలిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంబో అకాడమీ (హైదరాబాద్) అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీధర్, ప్రెసిడెంట్ శావణ్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ అశోక్, నాయకులు, క్టస్టర్ డైరెక్టర్లు భోజ్యానాయక్, బొర్రా సురేష్, ఉప్పతల ఏడు కొండలు, వీసం నాగభూషణం, కృష్ణయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment