రైతులతో చాకిరి
రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన నిర్వాహకులు దీనికి విరుద్ధంగా ఆ రైతులతోనే బలవంతంగా అదనపు పనులను చేయిస్తున్నారు. ధాన్యం రకాన్ని తెలియజేసే వివరాలను గన్నీ సంచులపై రంగులతో రాయించే బాధ్యతను నిర్వాహకులు, రైతులపై బలవంతంగా మోపుతున్నారు. దీంతో రైతులు ఎదురు చెప్పలేక రంగులను స్వయంగాా కొనుగోలు చేసి, గన్నీ సంచులపై ధాన్యం రకానికి సంబంధించిన వివరాలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాక సంచులను ధాన్యంతో నింపిన అనంతరం వాటిని కుట్టడానికి అవసరమైన తాడు (పురికోస)ను రైతులచే బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారు. ధాన్యం కాంటా వేసినందుకు గాను ఒక సంచికి రూ.24ను రైతుల నుంచే హమాలీ కూలీ పేరుతో వసూలు చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment