ఇల్లెందు: కొంతకాలంగా మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ వివాహిత తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసయడంతో వారు కేసు నమోదు చేశారు. పట్టణంలోని 13వ నంబర్బస్తీకి చెందిన దీప్తిని ఆమె భర్త కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తాళలేక దీప్తి శుక్రవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశామని సీఐ సత్యనారాయణ తెలిపారు.
అదనపు కట్నం వేధింపులపై...
ఇల్లెందు: అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని పట్టణంలోని సబ్జైల్బస్తీకి చెందిన వివాహిత ఎండీ ఫీర్దాస్ శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు సబ్‌జైల్ బస్తీకి చెందిన ఖురేషీతో జూలైలో వివాహమైందని, నాటి నుంచి భర్తతోపాటు అత్త అనీషా, మామ జిలానీ, మరిది శంషీ అదనపు కట్నం తేవాలని తరచూ వేదిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఎస్ఐ సూర్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment