కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన సీఎండీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవరంలో రూ.30 లక్షలతో ఆధునికీకరించిన కమ్యూనిటీ హాల్‌ను సోమవారం సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం కోసం అనేక సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. రామవరం ప్రాంత కార్మికులు శుభకార్యాల నిర్వహణ కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొలుత సీఎండీకి ఏరియా జీఎం ఎం.శాలేంరాజు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వరరెడ్డి, సత్యనారాయణరావు, జీఎంలు శాలెంరాజు, సుభాని, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, ఏఐటీయూసీ నాయకులు గట్టయ్య, వీరస్వామి, అధికారులు రామకృష్ణ, రాజారామ్, కోటిరెడ్డి, శివకేశవరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment