ఐటీసీ కాలనీలో విషాదం..
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా పెద్దకొజ్జియా వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీపీ పీఎస్‌పీడీలో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికుడు కదిరిశెట్టి సోమేశ్వరరావు మృతిచెందాడు. ఈ ఘటనలో అతని భార్య కూడా తీవ్రగాయాల పాలైంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖపట్టణంలోని సీతమ్మధారకు చెందిన కదిరిశెట్టి సోమేశ్వరరావు ఉద్యోగరీత్యా సారపాకలోని ఐటీసీ కాలనీలో నివాసముంటున్నాడు. అతని భార్య, తోడల్లుడు, మరదలు, మరదలు కుమార్తె, మామతో కలిసి ఒడిశాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి కారులో వెళ్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో సోమేశ్వరరావు (48), బంధువులు లావణ్య (43), స్నేహగుప్తా (19) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిస్తోంది. సోమేశ్వరరావు మృతిచెందిన విషయం తెలిసి తోటి కార్మికులు సంతాపం తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీసీ కార్మికుడి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment