● కాలం చెల్లిన పురుగుల మందుల విక్రయాలు ● పీఏసీఎస్‌లో చోటు చేసుకుంటున్న అక్రమాలు?
గుండాల: ఏజెన్సీ రైతులకు తోడ్పాటు అందించాల్సిన ప్రాథమిక సహకార పరపతి సంఘంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. నిధుల దుర్వినియోగంతో పాటు కాలం చెల్లిన పురుగుమందులను అంటగడుతూ.. అధిక ధరలకు ఎరువులు విక్రయించినట్లు విస్వసనీయ సమాచారం. వీటికి సంబంధించి ఇటీవలి కాలంలో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ఇదివరకే గన్నీ సంచుల విషయంలో రైతులకు చెల్లించాల్సిన రూ.14 లక్షలు స్వాహా చేసినట్లు బహిర్గతమైంది. కాగా ఈ ఖరీఫ్ సీజన్‌లో పీఏసీఎస్ ద్వారా ఎరువుల విక్రయాలు జరిగాయి. దీనిలో ఒక్కో ఎరువు బస్తాకు హమాలీతో కలుపుకుని రూ.274 తీసుకోవాల్సి ఉండగా అదనంగా రూ.6 వసూలు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారులు రూ.6 లక్షలు రికవరీ చేయాల్సి ఉందని నివేదికను జిల్లా కార్యాలయంలో అందించినట్లు విస్వసనీయ సమాచారం. ప్రభుత్వ అనుమతి పొందిన ఏడు రకాల కంపెనీలకు చెందిన పురుగులమందులను విక్రయించాల్సి ఉండగా ఇతర పురుగులమందుల దుకాణాల నుంచి తీసుకొచ్చి విక్రయించినట్లు సమాచారం. అదికూడా కాలం చెల్లిన మందులను విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరో రూ.8 లక్షలు రివకరికీ ఫైల్ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పీఏసీఎస్ కార్యాలయ సమావేశాల నిమిత్తం అధిక బిల్లులు సృష్టించి సుమారు రూ.3 లక్షలు దుర్వినియోగం చేసినట్లు తెలిసింది. ఇక ఆళ్లపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాము నుంచి 164 బస్తాలు మాయం అయినట్లు తెలియడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై డీసీఓ కుర్షీద్‌ను వివరణ కోరగా రిపోర్టులు తమ వద్దకు వచ్చాయని, పరిశీలిన చేయాల్సి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment