విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
కరకగూడెం: వైద్య శాఖ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ భాస్కర్ నాయక్ హెచ్చరించారు. మంగళవారం ఆయన పినపాక, కరకగూడెం పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రతీ ఒక్కరికి నమ్మకం కలిగేలా సేవలందించాలని చెప్పారు. అనంతరం కరకగూడెం ఫార్మసీలోని మందుల రిజిస్టర్లను, వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం, విధుల పట్ల అలసత్వంగా ఉండడంతో ఫార్మసిస్ట్ సునీల్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అంతకముందు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలసి నూతన అమ్మఒడి వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీఐఓ బాలాజీ నాయక్, వైద్యాధికారులు మధు, రవితేజ, శివ కుమార్, హెచ్‌ఈఓ కృష్ణయ్య పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్
Comments
Please login to add a commentAdd a comment