భూమిరత్న అవార్డు ప్రదానం
మధిర: పట్టణానికి చెందిన సేంద్రియ సాగు రైతు చీకటి నాగేశ్వరరావు భూమిరత్న అవార్డు అందుకున్నారు. ఆయన రాయపట్నం రోడ్డులో ఉన్న మాగాణి భూమిలో సేంద్రియ ఎరువులతో వరి సాగు చేస్తున్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో రైతు సహాయ వేదిక ఆధ్వర్యంలో ఆయనకు భూమిరత్న అవార్డుతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ఆదర్శరైతు సత్యనారాయణరెడ్డికి అవార్డు
వేంసూరు: జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని కందుకూరు గ్రామానికి చెందిన ఆదర్శరైతు గొర్ల సత్యనారాయణరెడ్డికి దేశీయ వరి రకాల నుంచి కొత్త విత్తనాలను అభివృద్ధి పరుస్తున్నందుకు గాను భూమిరత్న అవార్డు అందజేశారు. ఏపీలోని అనంతపురంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో రైతు సహాయ వేదిక సేవాసంస్థ ఆధ్వర్యంలో చరణ్‌సింగ్ పుట్టినరోజు సందర్భంగా రైతులకు ఈ అవార్డు ప్రదారం చేశారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment