ఉక్రెయిన్ పై చేస్తున్న వికృత క్రీడను ఆపాలంటూ రష్యాలో టెక్ కంపెనీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు కార్యాకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. దీంతో రష్యా సదరు కంపెనీలపై ఎదురు దాడికి దిగుతుంది. అయినా సరే రష్యాలో కొన్ని సంస్థలు తమ కార్యకలాపాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ రష్యాలో సేవల్ని నిలిపివేస్తుందంటూ ఫ్రాన్స్ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ నివేదించింది.
ఇప్పటికే టాప్ టెక్ కంపెనీలు రష్యాకు బిగ్ షాక్ ఇచ్చాయి. గూగుల్ సెర్చ్ టూల్‌తో పాటు యూట్యూబ్‌లో కొన్ని ఫీచర్లను రష్యాలో తొలగించాయి. యాపిల్ సైతం రష్యాలో ఐఫోన్స్‌తో సహా.. యాపిల్‌కు చెందిన ఏ ఒక్క ప్రొడక్ట్‌ను అమ్మడం లేదు. అలాగే.. గూగుల్, మెటా సంస్థలు కూడా వాటి ప్లాట్‌ఫామ్స్‌లో రష్యా స్టేట్ మీడియాను బ్యాన్ చేశాయి. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా కూడా యాపిల్, గూగుల్ బాటలోనే పయనిస్తోంది. ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్, మానిటైజేషన్‌ను నిలిపివేసింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ను రష్యాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి మాట్లాడుతూ..రష్యాలో ఇన్‌స్ట్రాగ్రామ్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో రష్యాలో పాపులర్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్‌టాక్ ప్లాట్‌ఫారమ్‌లకు చెందిన సుమారు 80 మిలియన్ల మంది యూజర్లు తగ్గుతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల 'కొన్ని దేశాల్లోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యన్ సైనికులపై హింసకు పిలుపునిస్తున్నారని, ఇందులో భాగంగా మెటా తన భద్రతా పద్ధతులను మారుస్తోందంటూ రాయిటర్స్ పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
చదవండి: పుతిన్ వార్నింగ్! టెక్ కంపెనీలకు భారీ షాక్, గీత దాటితే తాటతీస్తాం!!
Comments
Please login to add a commentAdd a comment