దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 582.84 పాయింట్ల వద్ద 81299.40, నిఫ్టీ 167.00 పాయింట్ల లాభంతో 24780.00 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో టీసీఎస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), బజాజ్ ఫిన్‌సర్వ్, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ మొదలైన కంపెనీలు చేరాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment