దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 172.75 పాయింట్ల లాభంతో 77510.34 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51.20 పాయింట్ల లాభంతో 23567.20 పాయింట్ల లాభంతో ముగిసాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ స్వల్ప లాభాలతోనే ముగిసాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా హిండాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), జేఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్ వంటివి ఉన్నాయి. హీరోమోటోకార్ప్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), విప్రో కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment