రెండో రోజు 10,987 ఓట్ల పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

రెండో రోజు 10,987 ఓట్ల పోలింగ్‌

Published Tue, May 7 2024 10:15 AM

రెండో రోజు 10,987 ఓట్ల పోలింగ్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో సోమవారం రెండోరోజూ ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించారు. జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాల్లో ఓట్లు ఉన్న ఉద్యోగులు కలెక్టరేట్‌లో ఏర్పా టు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్లను ఉద్యోగులు సద్వినియోగం చేసుకున్నారు. కలెక్టరేట్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌, పీవీకేఎన్‌ కేంద్రాన్ని చిత్తూరు అసెంబ్లీ ఆర్‌ఓ శ్రీనివాసులు పర్యవేక్షించారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వీస్‌ ఓట్ల పోలింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా సాగింది. పోలింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేసి ప్రజాప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.

ఇక వేయాల్సింది 953 మందే..

జిల్లాలో ఇక సర్వీస్‌ ఓట్లను వినియోగించుకోవాల్సింది 953 మంది ఉద్యోగులే. మొత్తం జిల్లాలో 11,940 మంది పోస్టల్‌బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఈ నెల 5,6 తేదీల్లో 10,987 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో 1,842 మందికి గాను 1,648 మంది, నగరిలో 1,231 మందికి గాను 1,133 మంది, జీడీ నెల్లూరులో 1,528 మంది ఉద్యోగులకు గాను 1,472, చిత్తూరులో 2,977 మందికి 2,573, పూతలపట్టులో 1,627 మందికి 1,538, పలమనేరులో 1,827 మందికి 1,695, కుప్పంలో 908 మంది ఉద్యోగులకు గాను 888 మంది ఓటేసినట్లు అధికారులు వెల్లడించారు.

టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ

Advertisement

తప్పక చదవండి

Advertisement