సకాలంలో వేతనాలు ఇవ్వాలి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని ఆర్డబ్ల్యూఎస్ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ హ్యాండ్‌పంప్ మెకానిక్‌లకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడుకు వినతి చేశారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓతో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ పంప్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జయకృష్ణ వారి సమస్యలపై మాట్లాడారు. మండలానికి ఒకరు చొప్పున హ్యాండ్‌పంప్ మెకానిక్స్ పని చేస్తున్నారని, వీరికి మొదటివారంలో వేతనాలు వచ్చే విధంగా చూడాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సకాలంలో వేతనాలు వచ్చే విధంగా ఎంపీడీఓలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. దీనికి జెడ్పీ సీఈఓ స్పందిస్తూ ఎంపీడీఓలకు రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఈశ్వర్‌రెడ్డి, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment