No Headline
ఇది సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ లాగేనా ?
గతంలో ప్రభుత్వ పథకాలు సవ్యంగా సాగేందుకు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్‌ను అమలు చేశారు. ఇందులో ఇంటి విస్తీర్ణం, ఇంటికి నెలకొచ్చే కరెంట్ బిల్లు, ఇంట్లోని సభ్యులైవరైనా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నారా?, ఎవరైనా ఇన్‌కంటాక్స్ చెల్లిస్తున్నారా? అని తేల్చి వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేశారు. ఇప్పుడు దీన్ని పేరు మార్చి గ్రూపుల్లోని మహిళల ఇళ్లల్లో ప్రొఫైల్ యాప్ పేరిట ఈ సమగ్ర ఆదాయాల సర్వేని చేపట్టడంతో గ్రూపు మహిళల్లో ఆందోళనలు తప్పడం లేదు. భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని వారు భయపడుతున్నారు. ఈ విషయమై స్థానిక మెప్మా అధికారులను వివరణ కోరగా ఈ సమగ్ర సర్వేపై ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ సర్వే ద్వారా గ్రూపు మహిళల కుటుంబాలు బాగుపడ్డాయా? లేదా అని స్పష్టమవుతుందన్నారు. ఇప్పటికీ గ్రూపుల ద్వారా మహిళలు అభివృద్ధి లేకుంటే వారిని ఎలా ఆర్థికంగా బలోపేతం చేయాలన్న విషయమై ప్రభుత్వం ఈ సర్వే ద్వారా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఏదేమైనా గ్రూపు సభ్యులు మాత్రం ఈ సమగ్ర సర్వేపై ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment