బాబు పాలనలో భద్రత కరువు | - | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో భద్రత కరువు

Published Wed, Nov 20 2024 12:30 AM | Last Updated on Wed, Nov 20 2024 12:30 AM

బాబు పాలనలో భద్రత కరువు

బాబు పాలనలో భద్రత కరువు

చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత కరువైందని నియోజకవర్గ ఇన్‌చార్జి కృపాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బాలికలపై లైంగిక దాడులు పెరిగాయన్నారు. మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలున్నా అవి టీడీపీకి చుట్టంలా మారాయన్నారు. సోషి యల్‌ మీడియాలో పోస్టులు పెడితే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చ విషం చిమ్ముతూ..కేసులు నమోదు చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు సరిత, బండి నాగరాణిరెడ్డి, మండల అధ్యక్షులు మణి, తులసియాదవ్‌, శేఖర్‌రాజు, విజయకుమార్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు గురవారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమసుందర్‌రెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు వేల్కూరు బాబురెడ్డి, పార్టీ కాపు సంఘం అధ్యక్షుడు విజయబాబు, పార్టీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు యశోదారెడ్డి, చిన్నమరెడ్డి, కమలాకర్‌రెడ్డి, ధనంజయవర్మ, కుప్పయ్య, జనార్దన్‌, ధనుంజయరెడ్డి, వెంకటరామిరెడ్డి, గుణశేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ హరిబాబు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement