అదే వేగం.. పడదా కళ్లెం?
చిత్తూరు మెసానిక్ మైదానం రోడ్డులో భారీ వాహనాలు, ఇసుక ట్రాక్టర్లు నిత్యం అతివేగంగా తిప్పుతున్నారు.
● వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సునీల్‌కుమార్
పూతలపట్టు: కూటమి పాలనలో రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపితమైన కక్షలు కొనసాగుతున్నాయని వైఎస్సార్ సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. ఆదివారం పూతలపట్టు మండలంలోని మూర్తిగానూరులో దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టడం లేదని, పాత కక్షలను తీర్చుకోవడానికే ఐదు నెలలు పట్టిందని తెలిపారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని మంగళవారం జిల్లా ఎస్పీని కోరగా, తప్పకుండా నిందితులను అరెస్టు చేసి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలపై దాడులు చేశారని నిరసన తెలిపారు. నెలక్రితం పూతలపట్టు మండల కేంద్రంలోని మై నారిటీ కో–ఆప్షన్ సభ్యుడు ఖాదర్ పొలానికి ఉన్న కంచెను తొలగించి అతనిపై దాడిచేశారని తెలిపారు. ఇది ఇలా ఉండగా సీఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ మూడురోజుల్లో నిందితులను పట్టుకుని, మండలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తానని తెలిపారు.
ఆర్థిక సంఘం నిధులు విడుదల
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు 2024–25 ఏడాదికి సంబంధించి మొదటి విడతను ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు ఆన్‌టైడ్ (పారిశుద్ధ్యం, వీధిదీపాలు, తాగునీరు, క్లాప్‌మిత్ర సిబ్బంది వేతనం) కింద రూ.12.13 కోట్లు, టైడ్ (సీసీ రోడ్లు, కాలువలు, పలు అభివృద్ధి పనులు) రూ.18.19 కోట్లు కలిపి మొత్తం రూ.30.32 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులు రెండోవిడతను ఆగస్టులో రూ.29.24 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment