గోకులం షెడ్డు పనులు వేగవంతం చేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మినీ గోకులం షెడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పశు సంవర్థక శాఖ జేడీ ప్రభాకర్ ఆదేశించారు. చిత్తూరు నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మినీగోకులంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మినీ గోకులం పనుల లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ షెడ్డు నిర్మించేలా చూడాలని చెప్పారు. ఏపీఓ చిన్న రెడ్డెమ్మ, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు.
త్వరగా నిర్మించుకోవాలి
గుడిపాల: రైతులు గోకులం షెడ్లను త్వరగా నిర్మించుకోవాలని పశుసంవర్ధకశాఖ జేడీ ప్రభాకర్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గోకులం షెడ్లకు అర్హులైన రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో 55 మందికి గోకులం షెడ్లు మంజూరైనట్లు చెప్పారు. ఇందులో 52 షెడ్లకు జియో ట్యాగింగ్ చేయగా, 35 మందికి గ్రౌండింగ్ అయిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment