స్టెమీతో గుండెకు రక్ష
● కరోనా తరువాత పెరిగిన గుండెజబ్బుల కేసులు ● ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు స్టెమీకి శ్రీకారం చుట్టిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ● జిల్లావ్యాప్తంగా 23 స్పోక్స్ సెంటర్ల ఏర్పాటు ● రెండేళ్లుగా 132 మందికి ఆయుష్షు ● స్పోక్స్ సెంటర్లను మళ్లీ ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు
కాణిపాకం: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా గుండె పోటుతో మరణిస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో పాటు మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహార నియమాల లోపం గుండె జబ్బులకు ప్రధాన కారణాలని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. సరైన నియమాలు పాటించకపోవడంతో బీపీ, మధుమేహ వ్యాధులు సైతం విస్తరిస్తున్నాయి. దీని కారణంగా కూడా గుండె లయ తప్పుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్టెమీ అమలు ఇలా ..
స్టెమీ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా ఏపీవీపీలో పరిధిలో ఉన్న 23 ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లకు బయోనెట్ కంపెనీకి సంబంధించిన 12 లీడ్స్ ఉండే ఈసీజీ మిషన్ అందజేశారు. అలాగే కంప్యూటర్ అందజేసి స్టెమీ సాఫ్ట్‌వేర్‌ను అందులో అప్‌లోడ్ చేయించారు. ఐసీయూ బెడ్, ఐవీ స్టాండ్, మల్టీ పారా మానిటర్, 26 రకాల అత్యవసర డ్రగ్స్‌ను అందుబాటులో ఉంచారు. అత్యవసర విభాగంలో పనిచేసే డాక్టర్లు, సిబ్బందితో పాటు ప్రత్యేకంగా ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్‌నర్సును కేటాయించారు. గుండె నొప్పితో స్పోక్స్ సెంటర్‌కు వచ్చిన వారికి తక్షణమే ఈసీజీ తీసి ఆ రిపోర్ట్‌ను స్టెమీ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇలా చేసిన వెంటనే రెండు నిమిషాల్లో ఆ వివరాలు తిరుపతి రుయాలోని హబ్‌కు చేరుతాయి. అక్కడున్న గుండె వైద్య నిపుణులు రిపోర్ట్ చూసి ఎలాంటి చికిత్స ఇవ్వాలో ఆ యాప్‌లోనే నమోదు చేస్తారు. గోల్డెన్ అవర్‌లో వెళ్తే.. సెంటర్‌లోనే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇస్తారు. తరువాత హబ్‌కు రెఫర్ చేస్తారు. ఈ ఇంజెక్షన్ ధర మార్కెట్‌లో రూ.45 వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రచార ఆర్భాటం కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలో కొత్తగా ప్రారంభిస్తున్నట్లు చూపించుకోవాలని పాలకులు యత్నిస్తున్నారు. దీనిపై వైద్యశాఖ నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెరుగుతున్న కేసులు..
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సుమారు 46 లక్షల మంది జనాభా ఉన్నారు. రెండేళ్ల కిందట ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఎన్‌సీడీ సర్వేలో భాగంగా 42 లక్షల మందిని పరీక్షించారు. అందులో 12,02,431 మంది మధుమేహం, 1,96,772 మంది రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. బీపీ, షుగర్ రెండూ ఉన్నవారు సుమారు 80 వేల మంది వరకు ఉన్నారని నిర్ధారణ అయింది. అలాగే 12 వేల మంది గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. స్టంట్ వేసుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని అంటున్నారు. వీరి సంఖ్య కూడా రెండు జిల్లాల్లోనూ 8వేలకు పైగా దాటిందని నిపుణుల గణంకాలు చెబుతున్నాయి.
సైలెంట్ కిల్లర్..
స్టెమీతో 132 మందికి ఊపిరి..
ఒకప్పుడు గుండెపోటు అటే మధుమేహం ఉన్నవారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీదపడిన వారికి, ఊబకాయం ఉన్నవారికి మాత్రమే వస్తుంది అనేకునేవాళ్లం. కానీ ప్రస్తుత కాలంలో గుండెపోటు తీరు మారింది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా స్ట్రోక్ వస్తోంది. మరీముఖ్యంగా జిమ్ చేస్తున్న వారు, ఎక్కువ జిమ్ చేస్తున్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల గ్యాస్‌ట్రిక్, ఛాతీలో నొప్పి లాంటివి కనిపించగానే టక్కుమని ఆస్పత్రికి వెళ్తున్నారు. తీరా వెళ్లాక నిజంగానే స్ట్రోక్ వచ్చిందని స్టంట్ వేయడం లేదంటే శస్త్ర చికి త్స చేయాల్సి రావడమో జరుగుతోంది. భి న్నంగా కనిపించే కేసులు కూడా ఉంటున్నా యి. పూర్తిగా గుండె నొప్పి రావడం, ఆయాసంగా అనిపించడం, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటివి కూడా గుండె సంబంధిత సమస్యలు కావొచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 23 స్పోక్స్ సెంటర్లలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 26వేల మందికి ఈసీజీ తీశారు. వారిలో 195 మంది గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 132 మందికి థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ రక్షణగా నిలిచింది. 125 మందిని తిరుపతిలోని హబ్‌కు రెఫర్ చేశారు. తద్వారా గుండెనొప్పితో బాధపడుతున్న వారికి స్టెమీ కార్యక్రమం భరోసా
కల్పిస్తోంది.
గుండెకు మేలు..
ఇటీవల కాలంలో చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా స్ట్రోక్ వస్తోంది. కరోనా సమయంలో చాలామంది స్ట్రోక్‌తో మరణించారు. స్టెమీతో గుండెకు సత్వర చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గోల్డెన్ అవర్‌లో వచ్చిన బాధితులకు రూ.45 వేలు విలువ చేసే ఇంజెక్షన్‌ను స్పోక్స్ సెంటర్‌లో ఉచితంగా అందిస్తారు. ఇప్పటి వరకు 132 మందికి ఈ ఇంజెక్షన్ ఇచ్చాం. ప్రతి సెంటర్‌లోను 5 ఇంజక్షన్ల చొప్పున్న ఉన్నాయి. – ప్రభావతి, డీసీహెచ్‌ఎస్, చిత్తూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment