‘‘పొట్టకూటి కోసం వచ్చాం.. చిన్న షెడ్డుకుని జీవనం సాగిస్తున్నాం.. కడు నిరుపేదలం.. మాకు ఎవరూ దిక్కు లేరు.. మాపై మీ ప్రతాపం ఏంది సారూ.. మీ కాళ్లు మొక్కుతాం.. మమ్మల్ని రోడ్డున పడేయవద్దు.. మాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. ఉన్నఫళంగా మా ఇల్లు కూలగొడితే మేం ఎక్కడికెళ్లి ఉండాలి ? సారూ..’’ అంటూ వెదురుకుప్పం మండలకేంద్రంలో నిరుపేద కుటుంబం అధికారుల కాళ్లా వేళ్లా పడి బతిమాలినా.. కనికరించలేదు. చెరువు పక్కన చిన్న షెడ్డు వేసుకుని జీవిస్తున్న నిరుపేద కుటుంబంపై అధికారులు తమ ప్రతాపం చూపారు.
Comments
Please login to add a commentAdd a comment