కరోనా వ్యాప్తితో పలు రకాల జబ్బులు మూటకట్టుకున్నాయి. తొలి విడతలో ఆ లక్షణాలే ప్రజలను భయపెట్టాయి. వైద్య నిపుణుల సూచనలతో మందులు, మాత్రల వాడకం వల్ల కరోనా మహమ్మారి నుంచి ఊపిరి పీల్చుకున్నారు. తక్కువ సంఖ్యలో మరణాలు చోటుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కరోనా కట్టడికి యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టింది.
అయితే కరోనా రెండో విడత ధాటికి జనం విలవిల్లాడిపోయారు. ఆక్సిజన్ అవసరమైంది. ఆ ప్రభావం గుండైపె పడింది. అప్పట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత గుండె జబ్బు సమస్యలతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. ఈ సంఖ్య గణనీయంగా పెరగడంతో అప్పటి రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించింది. పేదలకు ఊపిరి పోయడంతో పాటు గుండె జబ్బుల నివారణకు స్టెమీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment