నవజాత శిశుమరణాల నివారణకు కృషి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నవజాత శిశుమరణాల నివారణకు సమిష్టిగా కృషి చేద్దామని డీఐఓ హనుమంతరావు అన్నారు. చిత్తూరు నగరం టెలిఫోన్ కాలనీలోని అర్బన్‌హెల్త్ సెంటర్‌లో బుధవారం జాతీయ నవజాత శిశు వారోత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రసవం తర్వాత బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలని, తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి నవజాత శిశు ఎదుగుదలకు దోహద పడతాయన్నారు. బాల్య వివాహాలు, టీనేజ్‌లో గర్భం వల్ల తల్లీ బిడ్డకు ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు ఉషశ్రీ, లత, జానకీరావ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment