‘చిచ్చిలి’ కుటుంబానికి అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

‘చిచ్చిలి’ కుటుంబానికి అండగా ఉంటాం

Published Thu, Nov 21 2024 1:39 AM | Last Updated on Thu, Nov 21 2024 1:39 AM

‘చిచ్చిలి’ కుటుంబానికి అండగా ఉంటాం

‘చిచ్చిలి’ కుటుంబానికి అండగా ఉంటాం

రొంపిచెర్ల: చిచ్చిలి కుటుంబానికి తాను అండగా ఉంటానని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం ఆయన మండలంలోని చిచ్చిలివారిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి తల్లి చెంగమ్మ (95) మృతి చెందడంతో, ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన చోటుకు వెళ్లి పెద్దిరెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీపీ పురుషోత్తంరెడ్డి తల్లిదండ్రులు చిచ్చిలి వెంకట్రామిరెడ్డి, చెంగమ్మ గ్రామంలో ఎలాంటి మచ్చలేకుండా జీవించారని, అదే విధంగా వారి కుమారుడు కూడా వారి బాటలోనే నడుస్తున్నారని అన్నారు. వారి కుటుంబానికి తాను ఎప్పుడూ అండగా ఉంటా అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రెడ్డీశ్వర్‌ రెడ్డి, సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ దేవులపల్లె హరినాథరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మదనమోహన్‌రెడ్డి, ఎం.భాస్కర్‌ రెడ్డి, నాగిరెడ్డి, శివారెడ్డి, బాలాజీ, రవీంద్ర, కోటా వెంకటరమణ, డాక్టర్‌ శ్రీనాథ్‌, జి.రామచంద్రారెడ్డి, విజయభాస్కర్‌ రెడ్డి, కరుణాకర్‌, మహబుబ్‌బాషా, కమలాకర్‌ రెడ్డి, హరికృష్ణారెడ్డి, సైఫుల్లాఖాన్‌, ఓబులేసు, నీరజాక్షులునాయుడు, ప్రసాద్‌నాయుడు, సురేంద్రనాయుడు, నాగరాజ, శ్రీనాథ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఘన స్వాగతం..

రొంపిచెర్ల పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్దమల్లెలలో వైస్‌ ఎంపీపీ నూలు రెడ్డెప్ప ఆధ్వర్యంలో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు హారతులు పట్టి అయ్యప్పస్వామి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సచివాలయాల వద్ద టీడీపీ నాయకులు శిలాఫలకాలను ధ్వంసం చేశారని పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

రొంపిచెర్ల ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డికి పెద్దిరెడ్డి భరోసా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement