గంజాయి విక్రేతలు అరెస్ట్
పలమనేరు/గంగవరం: గంగవరం సమీపంలోని హైవేలో చిన్నూరు ఫ్‌లైఓవర్ వద్ద గంజాయిని ఏజెంట్లకు ఇస్తున్న ఓ వ్యక్తితో పాటు మరో ముగ్గురిని గంగవరం పోలీసులు బుధవారం పట్టుకున్నారు. సీఐ ప్రసాద్ వివరాల మేరకు.. పలమనేరు పట్టణం కాకాతోపునకు చెందిన మెకానిక్ మోహ న్(35) చిత్తూరులో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని తెచ్చి గంగవరం, పలమనేరుకు చెందిన జోసఫ్, మస్తాన్, ఆంటోనితో అధిక ధరలకు విక్రయిస్తాడు. ఆ క్రమంలో గంజాయి పంపకాలు చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 11.5 కిలోల గంజాయి ప్యాకెట్లును సీజ్ చేసి, కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించారు.
చిత్తూరులో ..
చిత్తూరు అర్బన్: చిత్తూరులో గంజాయి విక్రయిస్తున్న షేక్ అల్లాబకాష్ (36), సి.తులసి (22), ఆర్.సురేష్ (29) ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐలు ప్రసాద్, సుగుణతో కలిసి సీఐ నెట్టికంఠయ్య మీడియాకు వివరాలను వెల్లడించారు. మంగళవారం ఇరువారంలోని నీవానది బ్రిడ్జి సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా వీరి వద్ద కిలోకు పైగా గంజాయి పొట్లాలు లభించాయి. బెంగళూరులో ఉంటున్న అల్లాబకాష్ వైజాగ్ నుంచి గంజాయి తెచ్చి, ఇరువారానికి చెంది న తులసి, ప్రశాంత్‌నగర్‌కు చెందిన సురేష్‌తో నగరంలో విక్రయిస్తారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించడంతో జిల్లాజైలుకు తరలించారు.
నిందితుల బైండోవర్
పుంగనూరు: పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో గంజాయి విక్రయ కేసుల్లో నిందితులైన ప్రభాకర్, లక్ష్మీదేవి, రమణమ్మ, మాధవ, కొండయ్యను స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయించినట్లు ఎకై ్సజ్ సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment