కిశోర బాలికల్లో మానసిక ఒత్తిడి తగ్గించాలి
చిత్తూరు కలెక్టరేట్: కిశోర బాలికల్లో మానసిక ఒత్తిడి ని తగ్గించాలని ఐసీడీఎస్ పీడీ హైమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కిశోర వికాసం జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ మాట్లాడుతూ కిశోర బాలికలు శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారన్నారు. కిశోర బాలికల కు సరైన అవగాహన అవసరమన్నారు. 11–18 ఏళ్ల మధ్య ఉన్న కిశోర బాలికలకు శారీరకంగా మార్పులు సంభవిస్తాయని చెప్పారు. రుతుక్రమం ప్రారంభం కావడం, శారీరకంగా వచ్చే మార్పులపై అవగాహన లేకపోవడంతో మానసిక ఒత్తిడి పెరుగుతుందన్నారు. బాలికలు తమ సమస్యలను తల్లి దండ్రులకు వ్యక్తపరచడానికి సంకోచిస్తారన్నారు. కిశోర వికాసం కార్యక్రమంలో బాలికలకు శారీరకంగా సంభవించే మార్పులు, సమాజంలో మెలగాల్సిన తీరుతెన్నలపై అవగాహన కల్పించాలన్నారు. సమతుల ఆహారం కచ్చితంగా తీసు కోవాలన్నారు. సంబంధిత శాఖల సిబ్బంది గ్రామాల్లోని అంగన్ వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంకు శిక్షణ ఇచ్చి, మండలా ల్లో ఉన్న కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమా లు ఏర్పాటు చేయాలన్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రభావతిదేవి మాట్లాడుతూ కిశోర బాలికలకు ఆరోగ్య సంరక్షణ చాలా అవసరమన్నారు. మనదేశంలో దాదాపు 50 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు.
జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి గుణశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బాలికలకు విద్య అందిస్తే భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థాయికి చేరుతారన్నారు. విద్యతో బాహ్య ప్రపంచం అర్థమవుతుందన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నాగ సౌజన్య మాట్లాడుతూ ఆకతాయిలు, ఇతర వేధింపులు ఎదురైతే బాలికలు మహిళా సేఫ్టీ యాప్‌లో ఫిర్యాదు చేస్తే రక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం కిశోర బాలికలకు అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment