ఓ వైపు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు సమయం మార్పు విషయంపై వ్యతిరేకత తెలుపుతున్నా.. ప్రభుత్వం జీఓ విడుదల కాకముందే అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. అనధికారికంగా ఇప్పటికే పాఠశాలల సమయం మార్చివేశారు. శుక్రవారం రోజున అనధికారికంగా చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం మండలం ఎస్ఆర్ కండ్రిగ, బైరెడ్డిపల్లె మండలంలోని బైరెడ్డిపల్లె బాలురు హైస్కూలు, వి.కోట మండలం జౌనిపల్లె, రామకుప్పం మండలంలోని రామకుప్పుం బాలుర ఉన్నత పాఠశాలల్లో సమయం మార్పును అమలు చేశారు. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment