సాక్షి స్పెల్‌బీకి అపూర్వ స్పందన
విద్యార్థులకు సరైన వేదిక
స్పెల్‌బీ..
ఆధునిక యుగంలో విద్యార్థులు రాణించాలంటే ఆంగ్లం తప్పనిసరంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అన్నారు. ఈ ఆవశ్యకతను గుర్తించిన సాక్షి యాజమాన్యం ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా స్పెల్‌బీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంగ్ల భాషపై ప్రావీణ్యం సాధించేందుకు సరైన వేదిక సాక్షి స్పెల్‌బీ అన్నారు. ఉన్నత చదువుకు, ఆహ్లాదకరమైన పోటీతత్వం పెంపొందడానికి ఏటా సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ వంటి పరీక్షల్లో తమ పిల్లలను ప్రోత్సహిస్తే వారు ఉన్నతంగా రాణించేందుకు చక్కని అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
నాలుగు కేటగిరీల్లో
సాక్షి స్పెల్‌బీ సెమీఫైనల్ పరీక్ష
కేటగిరి – 1 : 1, 2వ తరగతులు
కేటగిరి – 2 : 3, 4వ తరగతులు
కేటగిరి – 3 : 5, 6, 7వ తరగతులు
కేటగిరి – 4 : 8, 9, 10వ తరగతులు
తిరుపతి ఎడ్యుకేషన్ : నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించడం తప్పనిసరిగా మారింది. ఉన్నత విద్య అయినా.. ఉన్నత కొలువులైనా పొందాలంటే ఆంగ్లంలో ప్రావీణ్యం తప్పనిసరి. ఆంగ్ల భాషపై పట్టు, నైపుణ్యం, సామర్థ్యం.. ఒడిసి పట్టుకుంటేనే నేటి తరం విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తారు. దీనిని గుర్తించే ఆంగ్ల భాషపై విద్యార్థుల్లో అవగాహన కల్పించి.. వారిలో నైపుణ్యం, ఆసక్తిని పెంపొందించేందుకు ఏటా సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా స్పెల్‌బీ పరీక్షలు నిర్వహిస్తూ.. వారిలో దాగున్న ప్రతిభకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే పాఠశాల స్థాయి, క్వార్టర్, సెమీఫైనల్, ఫైనల్ నాలుగు దశల్లో స్పెల్‌బీ నిర్వహిస్తోంది. ఫైనల్‌లో సత్తా చాటిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందిస్తోంది. ఈ పరీక్షకు ప్రధాన స్పాన్సర్‌గా డ్యూక్స్ వేఫి, అసోసియేషన్ స్పాన్సర్‌గా రాజమండ్రికి చెందిన ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరిస్తోంది. ఏటా సాక్షి నిర్వహిస్తున్న స్పెల్‌బీ పరీక్షలకు పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎప్పటిలానే ఈ ఏడాది సైతం విద్యార్థులు ఈ పరీక్షకు అధిక సంఖ్యలో హాజరై తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
మూడు జిల్లాల నుంచి హాజరైన విద్యార్థులు
ఆంగ్లంలో రాణించేందుకు స్పెల్‌బీ సరైన వేదిక థ్యాంక్స్ టు సాక్షి అంటున్న విద్యార్థులు
సెమీఫైనల్‌కు మూడు జిల్లాల నుంచి..
తిరుపతి జీవకోనలోని విశ్వం హైస్కూల్లో ఆదివారం సాక్షి స్పెల్‌బీ సెమీఫైనల్ పరీక్ష నిర్వహించారు. ఇదివరకు జిల్లాస్థాయిలో నిర్వహించిన క్వార్టర్ ఫైనల్ (రెండవ రౌండు)లో ప్రతిభ చాటిన విద్యార్థులకు రీజనల్ స్థాయిలో సెమీఫైనల్ నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన 1 నుంచి పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. నాలుగు కేటగిరీల్లో ఈ పరీక్షను లైవ్ ద్వారా నిర్వహించారు. ఇందులో సత్తా చాటిన విద్యార్థులు ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment