భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
పెనుమూరు(కార్వేటినగరం): భార్య అక్రమ సంబంధం జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మండల పరిఽధిలోని ఉడ్యాణంపల్లెలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఉడ్యాణంపల్లెకు చెందిన రవి ఆచారి కుమారుడు మోహన్ ఆచారి(36) కి పాకాల మండలం గాదంకి గ్రామానికి చెందిన సరితతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా సరిత సచివాలయ ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో 50 రోజులుగా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగితోనే ఉంటానంటూ భార్య తేల్చి చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన మోహన్‌ఆచారి సోమవా రం సెల్ఫీ వీడియో తీసి గ్రామస్తులకు తమ గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో ఉదయం ఆ వీడియో చూసిన గ్రాస్తులకు మోహన్ ఆచారి కనిపించక పోవడంతో వెతకడం మొదలు పెట్టారు. గ్రామానికి సమీపంలోని ఓ క్వారీపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment