నగరి : బాబు ష్యూరిటీ..బాదుడు మాత్రం గ్యారెంటీ అని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడంపై వైఎస్సార్ సీపీ శుక్రవారం నిర్వహించనున్న పోరుబాటకు సంబంధిత పోస్టర్లను ఆమె గురువారం విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ పాలనలో తొలి నాలుగేళ్లు విద్యుత్ బిల్లులు ఏ మాత్రం పెంచలేదన్నారు. ఒక్కసారి బిల్లులు పెంచినందుకే బాదుడే..బాదుడు అని ఊదరగొట్టిన టీడీ పీ నేతలు, వారు అధికారంలోకి వచ్చిన ఆరునెలలకే విద్యుత్ చార్జీల బాదుడు బాదు తున్నారన్నారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నారని, అధికారంలోకి వచ్చాక అది బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అయ్యిందన్నా రు. ఎన్నికల సమయంలో మరమగ్గ కార్మికులందరికీ 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇ స్తామని హామీ ఇచ్చారని, అది నమ్మి నేతన్నలు టీడీపీని బలపరిచారన్నారు. ఉన్నది ఊడిందన్న చందంగా ఉచిత విద్యుత్ ఇవ్వక పోగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎలక్ట్రి సిటీ డ్యూటీలో ఇచ్చిన 96 పైసల రాయితీని కూడా తొలగించిందన్నారు. ఆరునెలల్లోనే వడ్డింపులిలా ఉంటే ఇక ఐదేళ్లు ఎలా ఉంటుందోనని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. విద్యుత్ బాదుడుపై వైఎస్సార్ సీపీ పోరాటం సాగించనుందన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ పోరుబాట నిర్వహిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment