పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ సస్పెండ్ చేశారని డీపీఓ సుధాకర్‌రా వు గురువారం తెలిపారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో పనిచేస్తున్న సాదిక్‌అలీ, బంగారునాయక్ ప్రైవేటు వ్యక్తులకు డిజిటల్ కీని ఇచ్చి, నిధులు దుర్వినియోగం చేశారన్నా రు. ఆ ప్రైవేటు వ్యక్తులు ఆ కీని ఉపయోగించి వందలాది తప్పుడు జనన ధ్రువీకరణ పత్రా లను సృష్టించి, అమ్ముకున్నారన్నారు. దీనిపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదించామన్నారు. ఆయన వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
జాతీయస్థాయి
వేమన పద్యాల పోటీ
పలమనేరు: వేమన జయంతి సందర్భంగా జాతీయ వేమన పద్యాల పోటీలను వచ్చే జనవరి 18వ తేదీన నిర్వహించనున్నట్టు స్థానిక తెలుగు సాహితీ సాంస్కృతిక సమితి అధ్యక్షులు తులసీనాథం నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వందకు పైగా వేమన పద్యాలను చెప్పగలికే పిల్లలు జనవరి 5లోపు తమ పేర్లను 95534 29770 నంబర్‌కు వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. గెలుపొందిన పిల్లలకు అదే రోజు బహుమతులను ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు.
నేర నియంత్రణకు
కృషి చేయండి
–ఎస్పీ మణికంఠ చందోలు
వి.కోట: మూడు రాష్ట్రాల కూడలి అయిన వి.కో టలో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చే యాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నా రు. గురువారం వి.కోట పోలీస్ స్టేషన్‌ను ఆయ న తనిఖీ చేశారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్ నేతృత్వంలో సీఐ సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణాని కి చెందిన అమాయాక్ట్స్ అధినేత దశరథరెడ్డి సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో పట్ట ణంలో అమర్చిన అధునాతన టెక్నాలజీ సీసీ కెమరాల కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ చేతుల మీ దుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో అడుగడుగున పోలీ సు నిఘా ఉంటుందని, వాహన ప్రమాదాలతో పాటు వాహనాలు, ఇతర చోరీలు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, కొత్త వ్యక్తుల సంచారంపై నిరంతరం నిఘా ఉండడంతో నేరాల నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు. అనంతరం ఎస్పీ స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, వి.కోట సీఐ సోమశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ బాబు, ఏఎస్‌ఐలు జయకృష్ణ, మురళి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment