నేడు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనల
● సర్దుబాటు చార్జీల పేరిట ప్రజల నెత్తిన రూ.5 కోట్ల భారం ● విద్యుత్ చార్జీలు పెంచమంటూనే.. పొగబెట్టిన ప్రభుత్వం ● అల్లాడి పోతున్న సామాన్యులు.. చోద్యం చూస్తున్న సర్కారు ● 2026 జనవరి వరకు ప్రజలు భారం మోయాల్సిందే ● కూటమి ప్రభుత్వ ‘మోత’ను ఎండగట్టనున్న ప్రతిపక్షం
చిత్తూరు అర్బన్: మాట ఇస్తే దానిపై నిలబడాలి. లేకుంటే ఆ మాట ఊసే ఎత్తకూడదు. కానీ రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మాట ఇవ్వడం, ఆపై దాన్నే దాటేయడం జరిగిపోతున్నాయి. సూపర్‌సిక్స్ జాడలేదు. మ్యానిఫెస్టో ఊసేలేదు. పైగా అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు రూపా యి కూడా పెంచమంటూ వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట సామాన్యుడి నెత్తిన రూ.కోట్ల భారం మోపింది. మాట తప్పిన సర్కారు బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజల పక్షాన నిలిచిన ప్రతిపక్షం పోరు బాట కు సిద్ధమైంది. పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైన్యం పిలుపునిచ్చింది.
జిల్లాలో పోరుబాట ఇలా..
● కుప్పంలో ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు నుంచి ప్యాలస్ రోడ్డు మీదుగా రెస్కో కార్యాలయం వరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ భరత ఆధ్వర్యంలో బైకు ర్యాలీ జరుగుతుంది. పార్టీ కార్యకర్తలతో కలిసి రెస్కో కార్యాలయాన్ని ముట్టడిస్తారు. అధికారులకు వినతిపత్రం అందజేస్తారు.
● పుంగనూరులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఇద్దరూ కలిసి విద్యుత్ చార్జీల పెంపుపై చేపట్టనున్న నిరసన ర్యాలీలో పాల్గొంటారు. పుంగనూరులోని దివంగత నేత వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభించి, పీఎల్‌ఆర్ రోడ్డు మీదుగా ట్రాన్స్‌కో కార్యాలయం వరకు బైకు ర్యాలీ జరు గుతుంది. ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి, ఆపై అధికారులకు వినతి పత్రం ఇస్తారు.
● నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో పుత్తూరులోని ఆరిమాకుల మ్మ ఆలయం వద్ద ఉదయం 10 గంటలకు బైకు ర్యాలీ ప్రారంభిస్తారు. భవానీనగర్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ డీఈ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి, అధికారులకు వినతిపత్రం ఇస్తారు.
● పూతలపట్టులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు అంబేడ్కర్ విగ్రహం నుంచి బైకు ర్యాలీ ప్రారంభిస్తారు. పూతలపట్టు మండలకేంద్రంలో ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ కార్యాలయం ఎదుట బైఠాయించి, నిరసన వ్యక్తం చేస్తారు.
● పలమనేరులో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ వెంకటే గౌడ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే బైకు ర్యాలీ ఏటీఎం సర్కిల్ మీ దుగా రంగబాబు సర్కిల్ దాటుకుని ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఆపై అధికారులకు వినతి పత్రం అందజేస్తారు.
జిల్లా కేంద్రమైన చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటలకు కట్టమంచి చెరువు వద్ద ఉన్న వివేకానందుని విగ్రహం నుంచి స్కూటర్ ర్యాలీ ప్రారంభమవుతుంది. స్కావెంజర్స్ కాలనీ, జిల్లా కోర్టు సముదాయాల రోడ్డు, గాంధీ రోడ్డు మీదుగా ర్యాలీ సాగి.. అక్కడున్న ట్రాన్స్‌కో డీఈ కార్యాలయానికి చేరుకుని, నిరసన వ్యక్తం చేస్తారు. అధికారులకు వినతిపత్రం అందజేస్తారు.
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో వి ద్యుత్ చార్జీల పెంపుపై ఏపీఎస్పీడీసీఎల్ కా ర్యాలయ ముట్టడి జరుగుతుంది. కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆర్చి నుంచి ప్రారంభమయ్యే బైకు ర్యాలీ మండల సముదాయంలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్దకు చేరుకుని, ముట్టడి జరుగుతుంది.
ప్రజల పక్షాన పోరాటం
కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దోపిడీని ప్రశ్ని స్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల ఆవేదన ను ప్రశ్నించే గొంతుక కావాలని వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆందోళనలు చేయనున్నారు. పార్టీ కార్యకర్తలు, సామా న్యులతో కలిసి ట్రాన్స్‌కో కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయడానికి పార్టీ క్యాడర్ సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment