42 యూనిట్ల విద్యుత్‌కు రూ.20,800 బిల్లు
శాంతిపురం మండలంలోని ఎంకే పురానికి చెందిన గజ్జల రమేష్‌కు చెందిన పొలం వద్ద ఉన్న ఇంటికి కుప్పం రెస్కో సర్వీసు నంబర్ 698 కింద విద్యుత్ కనెక్షన్ ఉంది. ఊర్లో మరో ఇల్లు ఉండడంతో అక్కడ కాపురం ఉంటూ, పొలంలోని ఇంటి వద్ద రాత్రుల్లో పశువులను కట్టి ఉంచుతున్నారు. ఈ ఇంట్లోని 9 వాట్ల బల్బును రాత్రి పాలు పితికే సమయంలో గంట సేపటి వరకూ వేసి, ఆపి వేస్తారు. బయట ఉన్న 6 వాట్స్ బల్బును రాత్రంతా వేసి, ఉంచుతారు. దీనికి నెలసరి 20 యూనిట్లలోపు మాత్రమే విద్యుత్‌ను వినియోగిస్తారు. గత జూన్ 21వ తేదీ వరకూ మీటర్ రీడింగ్ 2,149 యూనిట్లతో పాత బకాయిలతో సహా ఆ నెలలో వాడిన 21 యూనిట్లకు విద్యుత్ బిల్లు బకాయి రూ.775 ఉండడంతో జూలై 5న రూ.800 రమేష్ చెల్లించాడు. కానీ తాజాగా ఈ నెల 4వ తేదీన ఇచ్చిన బిల్లులో మీటర్ రీడింగ్ 2,191 యూనిట్ల రీడింగుతో మొత్తం 42 యూనిట్లకు గాను రూ 20,800 విద్యుత్ బిల్లు వచ్చింది. దీనిని చూసి, అవాకై ్కన లబ్ధిదారుడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి, తన కు న్యాయం చేయాలని రెస్కో అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment