జిల్లాలో గృహ, వాణిజ్య విద్యుత్ సర్వీసులన్నీ కలిపి 5.61 లక్షల వరకు ఉన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఉపయోగించిన విద్యుత్‌కు కూటమి ప్రభుత్వం ఇంధన సర్దుబాటు చార్జీల రూపం ఈ ఏడాది నవంబర్ బిల్లు నుంచి జనం నెత్తిన అదనపు భారాన్ని మోపుతోంది. అప్పట్లో వాడిన ప్రతి యూనిట్ విద్యుత్‌కు 60 పైసల నుంచి 83 పైసల వరకు ప్రస్తుతం వస్తున్న నెలసరి బిల్లుల్లో అదనంగా కలుపుతున్నారు. ఒకేసారి మొత్తం వసూలు చేస్తే జనం నుంచి వ్యతిరేకత ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసి పడుతుందని గ్రహించి.. ప్రతినెలా రూ.30 నుంచి రూ.వందపైగా అదనంగా బిల్లుల్లో కలుపుతోంది. 2026 జనవరి వరకు ఇలా ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలు చేయనున్నారు. ఇలా అత్యధికంగా ఒక్కో వినియోగదారుడికి ప్రతి నెలా రూ.500 అదనపు భారం పడుతోంది. అంటే ప్రలి నెలా జిల్లా ప్రజల నుంచి కూటమి ప్రభుత్వం ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో రూ.5 కోట్లు కొల్లగొట్టనుందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment