చెప్పండి.. వింటాం!
అభిప్రాయాలు
● ఎస్సీ వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ ● ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పోటెత్తిన ఎస్సీలు ● జిల్లాలో ఏకసభ్య కమిషన్ పర్యటన ● వినతులు స్వీకరించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా
చిత్తూరు కలెక్టరేట్ : అభిప్రాయాలు చెప్పండి.. వించటాం అని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ మిశ్రా అన్నారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపై ఆయా సామాజిక వర్గాల ప్రజలు, సంఘాల నాయకుల అభిప్రాయాలను ఏకసభ్య కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం తెలుసుకుని, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వి విధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఎస్సీ ఉప కులాల సంఘాల నాయకులు, కులాల ప్రతిని ధులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ రంజన్ మిశ్రాతో పాటు చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ, తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తదితరులు పాల్గొని, ఉదయం 11 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు వినతులు స్వీకరించారు. వినతులు ఇచ్చేందుకు వచ్చిన వారి అభిప్రాయాలపై పలు ప్రశ్నలు వేస్తూ, వారి అభిప్రాయాలను రికార్డు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 394 వినతులు అందినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు.
కమిషన్‌కు జిల్లా సమగ్ర వివరాలు
ఏకసభ్య కమిషన్ దృష్టికి జిల్లా సమగ్ర వివరాలను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అందించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. 2024 సాధారణ ఎన్నికల తర్వాత జిల్లాలో ఎస్సీల సమస్యల పరిష్కారం కోసం 2 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ రాజ్యలక్ష్మి, డీఎఫ్‌ఓ భరణి, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
అభిప్రాయాలు ఇలా...
ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై వెలువరిచిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాలమహానాడు నేషనల్ వర్కింగ్ అధ్యక్షులు సుదర్శనమ్ అన్నారు. ఆర్టికల్ 341 వయలేషన్ అని చెప్పారు. ఇది మోదీ ప్రభావిత తీర్పుగా భావిస్తున్నట్లు తెలిపారు. 2004లో ఈవీ చెన్న య్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ బద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు ఎస్సీ ఓట్లతో గెలిచి ఈ రోజు తమకే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
వర్గీకరణ చేయకూడదని ఎస్సీ సంఘ నాయకులు పార్థసారథి, మునస్వామి అన్నారు. 29 రాష్ట్రాల్లో మెజారిటీ 1/3వ వంతు ఉండాలన్నారు. పార్లమెంట్ రాజ్యసభ ఆమోదించాలని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు.
ఉపవర్గీకరణ చేయకూడదని ఏపీ శ్రీ రమాబాయ్ మహిళా ఎస్సీ,ఎస్టీ సంఘం చైర్మన్ దేవానంద్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాక ముందే యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖదేవ్ ఎస్సీ వర్గీకరణపై పలు వివరాలు వెల్లడించారన్నారు. ఉపవర్గీకరణ నష్టం చేకూరుస్తుందని ఆయన స్పష్టంగా తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో జిల్లా అధ్యక్షులు రాఘవులు, ఎస్‌ఎల్‌టీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు నరేంద్రబాబు జాతీయ నాయకులు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పలు ప్రాంతాల నుంచి ఎస్సీలు ర్యాలీగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ గత 70 ఏళ్లుగా మాదిగలు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. విద్యా, ఉద్యోగాల్లో మాదిగలు ఎంతో వెనుకబడ్డారన్నారు. రిజర్వేషన్లలో అసమానతతోనే ప్రస్తుతం అవస్థ పడుతున్నట్లు చెప్పారు. మాదిగల నష్టాలను పరిష్కరించాలంటే ఎస్సీ వర్గీకరణ ఒక్కటే మార్గమని తెలిపారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అభిప్రాయాలు
ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎస్సీ కులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు. నివేదిక తయారీకి అవసరమైన ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం, విద్య, రాజకీయ, ఉపాధి, హౌసింగ్, పోలీస్ తదితర అంశాలపై కమిషన్ కోరిన మేరకు స్పష్టమైన సమాచారాన్ని అందించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment