పండుటాకుల పింఛన్ పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్‌ల పంపిణీ ఆర్భాటం తప్పితే లబ్ధిదారులకు మేలు చేసిందేమీ లేదు. ఏడు నెలలుగా ప్రతి నెలా పింఛన్‌ల పంపిణీలో జిల్లాలోని లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన పింఛన్‌ల పంపిణీలో సర్వర్ మొరాయించింది. దీంతో వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఇలాంటి సమస్యలెప్పుడూ తలెత్తలేదని పింఛన్‌దారులు పెదవి విరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గంగాధరనెల్లూరు, చిత్తూరు, పుంగనూరు, కుప్పం, పలమనేరు, నగరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో పింఛన్‌ల పంపిణీ అస్తవ్యస్తంగా సాగించారు. ఇళ్ల వద్ధకు వెళ్లి పంపిణీ చేయాల్సిన పింఛన్ నగదును ఒకేచోట అందరినీ చేర్చి ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 2,65,698 మందికి పింఛన్‌లు అందజేయాల్సి ఉంది. అయితే శనివారం సాయంత్రం వరకు 2,55,818 మందికి పింఛన్‌లు పంపిణీ చేశారు. మిగిలిన 9,880 మందికి పింఛన్‌లు అందించలేక పోయారు.
Comments
Please login to add a commentAdd a comment