రాజకీయంగా ఎదుర్కోలేక విమర్శలు | - | Sakshi
Sakshi News home page

రాజకీయంగా ఎదుర్కోలేక విమర్శలు

Published Sun, Feb 2 2025 2:43 AM | Last Updated on Sun, Feb 2 2025 2:43 AM

రాజకీ

రాజకీయంగా ఎదుర్కోలేక విమర్శలు

ఎమ్మెల్సీ భరత్‌

శాంతిపురం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులను రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌ పేర్కొన్నారు. అధికార పక్షం కుట్ర పూరితంగా చేస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని ఖండించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి డైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు. సీఎంకు చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డిపై తప్పుడు విమర్శలు చేయిస్తున్నారని అన్నారు. భూ కబ్జా విమర్శలు కూడా ఈ కోవకు చెందినవేనన్నారు. సూపర్‌ సిక్స్‌ అమలు కాక, కొత్త ప్రభుత్వం వచ్చాక గతంలో ఉన్న ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాక జనం తల్లడిల్లిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

‘ప్రభుత్వ’బడిలో పార్టీ సమా‘వేషాలా’!

సదుం : ప్రభుత్వ పాఠశాలలో రాజకీయ సమావేశాలకు వీల్లేదని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జా రీ చేసింది. కానీ సోమల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి 2న నిర్వహించే జనసేన సమావేశానికి ఎలా అనుమతి ఇచ్చిందని వైఎస్సార్‌ సీపీ ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నాగబాబు హాజరయ్యే ఈ సమావేశానికి నాయకులు ఏ ర్పాట్లు చేస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వులు జనసేనకు వర్తించవా.. అని ఆయన ప్రశ్నించా రు. దీనికి అధికారులు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.

అటవీ సరిహద్దులు పక్కాగా ఉండాలి

గుడిపాల : అటవీ సరిహద్దులు పక్కాగా ఉండే విధంగా చూసుకోవాలని ఇండియన్‌ ఫారెస్ట్‌ సెక్షన్‌ ట్రైనీ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి సాంకేత్‌ గరుడ్‌ అన్నారు. శనివారం ఆయన పాపసముద్రం పంచాయతీలో పారెస్ట్‌ , రెవెన్యూ సరిహద్దులు పరిశీలించారు. అలాగే బంగారక్క చెరువులో చెరువు , రెవెన్యూ భూముల సరిహద్దులు వాటి వివరాల గురించి సర్వేయర్‌లను అడిగి తెలుసుకున్నారు. గుడిపాల మండలంలో రీసర్వే ఎలా జరుగుతుందనే అంశాలపై రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌ రూపారాణిని అడిగి తెలుసుకున్నారు. గుడిపాల మండలంలో అటవీశాఖ భూము లు , రెవెన్యూ , ఇరిగేషన్‌కు సంబంధించిన భూములు ఎంత ఉన్నాయి అనే వాటిపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ లక్ష్మిదేవి, సర్వేయర్‌ గోపినాఽథ్‌, కమ్యూనిటీ సర్వేయర్‌ కోటీశ్వరరావు, గ్రామ సర్వేయర్‌లు భానుప్రతాప్‌, ప్రకాష్‌, సంపత్‌ పాల్గొన్నారు.

అంగన్‌వాడీల హామీలు నెరవేర్చాలని నిరసన

వి.కోట : ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని , వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్ప ర్స్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్‌ ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీల మేరకు జీతాలు పెంచి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్షుడు కోదండయ్య, జిల్లా అధ్యక్షుడు ప్రభావతి, నాయకులు సుజాత, జోతి, కార్యకర్తలు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రాజకీయంగా ఎదుర్కోలేక విమర్శలు 
1
1/3

రాజకీయంగా ఎదుర్కోలేక విమర్శలు

రాజకీయంగా ఎదుర్కోలేక విమర్శలు 
2
2/3

రాజకీయంగా ఎదుర్కోలేక విమర్శలు

రాజకీయంగా ఎదుర్కోలేక విమర్శలు 
3
3/3

రాజకీయంగా ఎదుర్కోలేక విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement