రామకుప్పం: గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సంస్థ( ఏపీఎస్టీసీఎఫ్‌సీ)చైర్మన్ బోరగం శ్రీనివాసులు అన్నారు. మంగళవారం రామకుప్పం మండలంలోని వీర్నమలతండా గిరిజనులు, కుప్పం మండలంలోని కంగుంది యానాదులతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో కలసి ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైకార్ సంస్థ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఎస్టీల అభ్యున్నతికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కోళ్లు, గొర్రెలు, పశువులు అవసరమైన వారికి పంపిణీ చేస్తామన్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మెన్ పీ.ఎస్.మునిరత్నం,ట్రైకార్ సభ్యులు అనురాధ, లావణ్య,జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment