జిల్లా ప్రభుత్వాస్పత్రిలో జనన సర్టిఫికెట్ల మంజూరులో నిర్లక్ష్యం దాపురిస్తోంది. ఇక్కడ బర్త్ సర్టిఫికెట్ పొందేందుకు అధికంగా తల్లులే వస్తుంటారు. వారు పత్రం తీసుకునేందుకు విభాగం ఎదుట గంటల తరబడి పడిగావులు కాస్తున్నారు. అయినా కొంత మందిని రేపు రండి అంటూ తిప్పించుకుంటున్నారు. ధ్రువపత్రాల కోసం నెలల తరబడి తిరిగినా చేతికి పత్రం రావడం కష్టంగా మారింది. మార్పులు, చేర్పులకు అయితే కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆ విభాగం తలుపులు వేసుకోవడంతో పత్రం జారీ విమర్శల కు తావిస్తోంది. సిబ్బంది కొరత కారణంగా దరఖాస్తులు వేలసంఖ్యలో పెండింగ్ ఉన్నాయి. ఈ విషయమై అధికారుల పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు, ఆస్పత్రి వర్గాలు మండిపడుతున్నాయి. మరణ ధ్రువీకరణ పత్రం జారీ కూడా ఇలాగే తయారైందని పలువురు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment