ఉగ్రవాదుల కాల్పుల్లో సైనికుడు కార్తీక్ వీరమరణం
● ఆయన స్వగ్రామం ఎగువ రాగిమానుపెంట ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ● నేడు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
వీరమరణం చెందిన కార్తీక్(ఫైల్)
బంగారుపాళెం: ఇంటర్‌తోనే చదువు ఆపేసి, దేశానికి సేవ చేయాలన్న తలంపుతో ఆర్మీలో సైనికుడిగా చేరాడు ఆ యువకుడు. దేశ భద్రత కోసం పదేళ్లుగా శ్రమిస్తున్నాడు. అయితే ఆదివారం జ మ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైనికుల నడుమ జరి గిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వీరమరణం పొందాడు. దీంతో మంగళవారం ఆ యువకుడి స్వగ్రామంలో విషాదఛాయ లు అలుముకున్నాయి. బంగారుపాళెం మండలం ఎగురాగిమానుపెంట గ్రామానికి చెందిన పంగల వరదరాజులు మందడి, సెల్వి దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పెద్ద కుమారుడు రాజేష్, రెండో కుమారుడు కార్తీక్. వరదరాజులు మందడిది రైతు కుటుంబం. కార్తీక్ ప్రాథమిక విద్య బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ చిత్తూరు పీసీఆర్ జూనియర్ కళాశాలలో చదువుకున్నాడు. డిగ్రీలో చేరాలనుకునేలోపు 2015 నవంబర్‌లో జరిగిన ఆర్మీ సెలక్షన్లకు వెళ్లి సైనికుడిగా ఎంపికయ్యాడు. మొదట రాజస్థాన్‌లో 87 ఆర్ముడ్ రేజ్‌మెంట్‌లో పోస్టింగ్ వచ్చింది. అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశారు. అక్కడి నుంచి రెండేళ్ల క్రితం జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల నిర్మూలన కూబింగ్ కోసం రాష్ట్రీయ రైఫిల్(22 ఆర్‌ఆర్)విభాగానికి వెళ్లారు. రెండు నెలల క్రితం స్వగ్రామమైన ఎగువ రాగిమానుపెంట గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపారు. తిరిగి విఽధి నిర్వహణ కోసం జమ్ముకశ్మీ ర్‌కు వెళ్లాడు. ఆదివారం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆర్మీ జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో తీ వ్రంగా గాయపడి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ సోమవారం వీరమరణం పొందాడు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు కార్తీక్ తండ్రి వరదరాజులు మందడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో కార్తీక్ వీ రమరణం చెందడంతో ఎగువ రాగిమానుపెంట గ్రామంలో విషాదం అలముకుంది. గ్రామానికి వ చ్చినప్పుడల్లా అందరితో సరదాగా మాట్లాడేవా డ ని గుర్తుచేసుకున్నారు. కార్తీక్ వీరమరణం బాధ క లిగించినా దేశసేవ కోసం ప్రాణత్యాగం చేయడం గ్రామానికి గర్వకారణమన్నారు. కాగా మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు.
కార్తీక్ కుటుంబ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment