ద్రవిడ వర్సిటీలో నేటి నుంచి న్యాక్ పీర్ టీమ్ పర్యటన
– ఏడుగురు సభ్యులతో వర్సిటీ సందర్శన
కుప్పం: కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో న్యాక్ పీర్ టీమ్ బుధవారం నుంచి మూడు రో జుల పాటు పర్యటించనున్నట్లు వర్సిటీ రిజ్రిస్టార్ ఆచార్య వి.కిరణ్‌కుమార్ తెలిపారు. ఐదేళ్లకొక సారి న్యాక్ గుర్తింపులో భాగంగా న్యాక్ టీమ్ వర్సిటీలో పర్యటించి, నూతన గ్రేడింగ్‌ను ప్రక టించనుందన్నారు. గతంలో వర్సిటీకి ‘బి’ గ్రేడు తో సరిపెట్టుకుంది. దీంతో వర్సిటీ అభివృద్ధి చెందక ఐదేళ్లపాటు నత్తనడకన సాగింది. అయితే ప్రస్తుతం మరోమారు న్యాక్ గుర్తింపులో భాగంగా వర్సిటీ న్యాక్ గ్రేడింగ్‌కు సిద్ధమైంది. న్యాక్‌టీమ్ రాకతో వర్సిటీని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు వర్సిటీలోని అన్ని విభాగాలు న్యాక్ బృందం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన న్యాక్ బృందం వర్సిటీలో మూడు రోజుల పాటు పర్యటించి నివేదికను సమర్పించి.. నూతన గ్రేడింగ్‌ను ప్రకటించనుంది. అయితే వర్సిటీకి ‘ఏ’గ్రేడ్ వస్తే అభివృద్ధి చెందుతుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఏంటి ఈ పరీక్ష!
● దివ్యాంగ పింఛన్ పునఃపరిశీలన
● జిల్లా ఆస్పత్రిలో దివ్యాంగుల పడిగాపులు
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గత రెండు రోజులుగా దివ్యాంగుల పింఛన్ల పునఃపరిశీలన చేపడుతున్నారు. తొలుత కళ్లు, చెవి, మూగ సంబంధిత సమస్యలతో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులను సచివాలయా ల వారీగా రప్పించి పరీక్షలు చేస్తున్నారు. అయితే వారు అక్కడ పరీక్ష కోసం పడిగావులు కాస్తున్నారు. నిరీక్షించి నీరసించిపోతున్నారు. మా లాంటి వాళ్లను ఎందుకు ఇలా పడిగాపులు కాయిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పరీక్షల్లో కొన్ని బోగస్ పింఛన్‌దారులు బయటపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment