కాణిపాకం పాఠశాలకు స్వచ్ఛ పురస్కారం
ఐరాల: క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్‌లో భాగంగా పూతలపట్టు నియోజకవర్గం, కాణిపాకం జెడ్పీ హైస్కూల్‌కు జాతీయ స్థాయి అవార్డు దక్కిందని మంగళవారం ఆ పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్‌నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ 2024–25 విద్యాసంవత్సరానికి తమ పాఠశాలకు జాతీయస్థాయిలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్‌ఈ) న్యూఢిల్లీ వారిచే నిర్వహిస్తున్న జాతీయస్థాయి క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ అవార్డు పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 12 పాఠశాలలు ఎంపిక చేశారని తెలిపారు. ఇందులో తమ పాఠశాల ఒకటిగా నిలవడం గర్వకారణమని చెప్పారు. ఈ అవార్డును ఫిబ్రవరి 4వ తేదీన న్యూఢిల్లీలో అందుకోనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన పాఠశాల ఎన్‌జీసీ కో ఆర్డినేటర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సురేంద్రబాబు, అలాగే సైన్స్ ఉప్యాధ్యాయులను, వీరికి తోడ్పాటును అందించిన ఉపాధ్యాయులు సోమశేఖర్‌నాయుడు, బాలయ్య, బాలసుబ్రమణ్యం, మాధవరెడ్డి, నరేష్‌బాబులను అభినందించారు. వరుసగా మూడో సారి తమ పాఠశాల ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment