శిశుమరణాల కట్టడికి కృషి చేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): శిశు మరణాలను కట్టడికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని డీఐఓ హనుమంరావు ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం శిశుమరణాలపై సమావేశం నిర్వహించారు. శిశు మరణాల విషయంలో అలసత్వం ఉండకూడదన్నారు. గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందించాలన్నారు. వారు సరైన పౌష్టికాహారం తీసుకునేలా చూడాలన్నా రు. రక్తలోపం ఉంటే వారిని నిత్యం పర్యవేక్షిస్తూ తగిన వైద్య సేవలను అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో వైద్యులు జానకీరావ్, ఉషశ్రీ , లత, సుబ్రమణ్యం, శిరీష, సింధూర, హేమవతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment