విద్యతోనే మహిళా సాధికారిత
పలమనేరు : విద్యతోనే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాధ తెలిపారు. మహిళా సాధికారితపై పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్ర వారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ రాధ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళలు మరింత ముందుకెళ్లాలని, అలాగే విద్యార్థినులు సైతం సరికొత్త ఆలోచనలతో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ కేశవ మాట్లాడుతూ మన దేశంలో మహిళా సాధికారిత..విదేశాల్లో సాధికారత అనే అంశాలను వివరించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళా సాధికారిత అంశంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సునీలాశ్యామ్, గీతాంజలి, కల్పన కృష్ణయ్య, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment