సంస్కరణలతో సహకారం వృద్ధి
అమలాపురం టౌన్: సహకార శాఖలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంస్కరణలు, సాంకేతిక విప్లవంతోనే సహకార వ్యవస్థ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని జిల్లా సహకార అధికారి ఎస్.మురళీకృష్ణ అన్నారు. అమలాపురంలోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో ఆయన సహకార వారోత్సవాలను గురువారం ప్రారంభించారు. తొలుత ఆయన సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. సహకార సేవలు పారదర్శకంగా అందించడంలో జిల్లా శాఖ ముందు ఉంటుదని అన్నారు. జిల్లాలోని 166 ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, 24 డీసీసీబీ శాఖా కార్యాలయాలు, 25 చేనేత సంఘాల్లో వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమలాపురంలోని డీసీసీబీ శాఖా కార్యాలయం ప్రాంగణంలో సీనియన్ మేనేజర్ కేఎస్‌వీఎస్‌ఎన్ మూర్తి సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సహకార వారోత్సవాల జిల్లా ఇన్‌చార్జి ఆదిమూలం వెంకటేశ్వరావు అతిథిగా పాల్గొని వారోత్సవాల విశిష్టత, సహకార ఉద్యమాలను ముందుకు నడిపించిన మహనీయుల గురించి వివరించారు. జిల్లాలోని ప్రతి సహకార సంఘంలో పతాక ఆవిష్కరణతో పాటు సహకార ప్రతిజ్ఞ చేశారు. అమలాపురంలోని జిల్లా కార్యాలయం, డీసీసీబీ శాఖా కార్యాలయంలో జిల్లా అధికారి మురళీకృష్ణ, వారోత్సవాల జిల్లా ఇన్‌చార్జి వెంకటేశ్వరావులు సహకార ప్రతిజ్ఞ చేయించారు. అలాగే అమలాపురంలోని డివిజన్ సహకార అధికారి కార్యాలయంలో డివిజన్ అధికారి ఎ.రాధాకృష్ణారావు ఆధ్వర్యంలో వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. రైతులు, చేనేత కార్మికులు ఇలా పలు రంగాల్లో సహకార వ్యవస్థ ద్వారా బలోపేతం అవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ నోడల్ అధికారి పి.శ్రీనివాస్‌తో పాటు జిల్లా, డివిజన్, డీసీసీబీ శాఖా కార్యాయాల సిబ్బంది పాల్గొన్నారు. రైతులు, చేనేత కార్మికులు ఆయా సహకార సంఘాల్లో జరిగిన వారోత్సవాల్లో భాగస్వాములయ్యారు.
జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment