పిల్లలు బడిలోనే ఉండాలి
జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహ్మతుల్లా
ఐ.పోలవరం: బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, వారిని పనులకు వినియోగించకూడదని ముమ్మిడివరం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహ్మతుల్లా చెప్పారు. ముమ్మిడివరం జెడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ చిల్డ్రన్స్ అంటే భారతదేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినంగా పురస్కరించుకుంటామన్నారు. 14 ఏళ్లు లోపు చిన్నారులు నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలోనే ఉండాలన్నారు. చిన్నారులు ఫ్యాక్టరీల్లో, కిరాణా షాపుల్లో, మరే ఏ ఇతర ఇతర సంస్థల్లో గాని పని చేస్తే చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అముడా అనుమతులు లేకుంటే చర్యలు
వైస్ చైర్‌పర్సన్, జేసీ నిషాంతి
అమలాపురం రూరల్: అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అముడా) అనుమతులు లేని భవన నిర్మాణాలు, లే అవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అథారిటీ వైస్ చైర్‌పర్సన్, జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) టి.నిశాంతి హెచ్చరించారు. జిల్లాలోని అముడా పరిధిలోని 14 మండలాలకు చెందిన 231 గ్రామ పంచాయతీల కార్యదర్శులకు మండలంలోని ఈదరపల్లిలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో గురువారం శిక్షణ ఇచ్చారు. అముడా ప్రణాళికపై జేసీ మాట్లాడుతూ 231 గ్రామాల్లో అముడా ప్రణాళిక మేరకు అభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో లేని భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి మాట్లాడుతూ 300 గజాల లోపు స్థలాలకు మాత్రమే పంచాయతీలు అనుమతులు ఇవ్వాలని సూచించారు. అంతకు మించి గజాలకు అముడా నుంచి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శులకు జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి ఎ.సత్యమూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏవో వీఎస్ చిట్టిబాబు, ఏపీవో పి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇసుక బిడ్ల పరిశీలన
ఇసుక తవ్వకాలు, తరలింపు, లోడింగ్ నిమిత్తం పిలిచిన ఫైనాన్స్ బిడ్లను గురువారం రాత్రి జేసీ నిశాంతి జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యుల సమక్షంలో తెరిచారు. తక్కువ రేటు కోట్ చేసిన ఏజెన్సీలకు ఇసుక రీచ్‌ల నిర్వహణకు అప్పగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment